38:12 చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖ నివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చుకత్తిరించు వారియొద్దకు వెళ్లెను38:13 దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను.38:14 అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతని కియ్యబడకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి, ముసుకు వేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోన